బంప‌రాఫ‌ర్ ను ప‌ట్టేసిన మీనాక్షి

3rd March 2026

White Scribbled Underline

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన మీనాక్షి చౌద‌రి ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

హిట్2, గుంటూరు కారం, ల‌క్కీ భాస్క‌ర్, సంక్రాంతికి వ‌స్తున్నాం, అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ స‌క్సెస్‌లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉంది మీనాక్షి.

ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌తో వృష క‌ర్మ మూవీ చేస్తున్న మీనాక్షి ఇప్పుడు బాలీవుడ్ లో ఓ బంప‌రాఫ‌ర్ ను అందుకున్న‌ట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న భాగ‌మ్ భాగ్ సీక్వెల్ లో మీనాక్షి పేరుని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. 

ఓ వైపు టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మీనాక్షి బాలీవుడ్ లో కూడా వ‌రుస అవ‌కాశాలు అందుకోవ‌డం చూస్తుంటే ఆమె కెరీర్ లో ఎంత ముందుకు దూసుకెళ్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఇక ఈ ఆఫర్ ఫైనల్ అయితే మీనాక్షి చౌదరి కెరీర్‌కు ఇది పెద్ద మైలురాయిగా మారనుంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె త్వరలోనే స్టార్ హీరోయిన్‌ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.