గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఉప్పు (సోడియం) తగ్గించడం ,పొటాషియం పెంచడం రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.
అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. రోజువారీ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గించడం గుండెపై భారం తగ్గిస్తుంది.
పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తనాళాలను సడలిస్తుంది. దీంతో రక్తప్రసరణ సాఫీగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అరటిపండ్లు, పాలకూర, బీట్‌రూట్, టొమాటోలు, చిలగడదుంపలు, చిక్కుళ్లు, పెరుగు లేదా మజ్జిగ వంటి ఆహారాలను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి సహజంగా పొటాషియం అందించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ప్యాకెట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
నిత్యం వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం కూడా రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి గుండెను బలంగా ఉంచి దీర్ఘకాల ఆరోగ్యాన్ని అందిస్తుంది.
శుక్రవారం ఏ రాశి వారు ఎటువంటి పూజ చేయాలి