బ్రెయిన్ హెల్త్‌కు హానికరమైన చర్యలు ఇవే..

2nd March 2026

White Scribbled Underline

మనిషి మెదడు శరీరానికి నియంత్రణ కేంద్రం. దాని పనితీరుపై రోజువారీ అలవాట్లు నేరుగా ప్రభావం చూపిస్తాయి.

తగినంత నిద్ర లేకపోవడం మెదడు పై నెగటివ్ ప్రభావం చూపే ప్రధాన కారణంగా భావించబడుతుంది. నిరంతరంగా నిద్ర తగ్గితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గే ప్రమాదం ఉంటుంది.

అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా హానికరం. పోషకాలు లేని ఆహారం మెదడు కణాల పనితీరును దెబ్బతీస్తుంది.

శారీరక వ్యాయామం లేకపోవడం రక్త ప్రసరణను మందగిస్తుంది. మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గే అవకాశం ఉంటుంది.

అధిక ఒత్తిడి, ఆందోళనను నియంత్రించకపోతే మెదడుపై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుంది. దీని వల్ల ఏకాగ్రత లోపం, నిర్ణయ సామర్థ్యం తగ్గుదల కనిపించవచ్చు.

మొబైల్, స్క్రీన్ వినియోగం ఎక్కువగా ఉండటం కూడా సమస్యగా మారుతుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉపయోగించే పిల్లలలో స్వయంగా ఆలోచించే సామర్థ్యం మందగీస్తోంది అని కొన్ని సర్వేలలో వెల్లడయ్యింది.

సమతుల్య జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకం. అలాగే పాజిటివ్ థింకింగ్ తో జీవితంలో ముందుకు వెళ్లడం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అలాగే తగినంత నీరు తాగకపోవడం వల్ల మెదడు పనితీరు మందగించే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి, అలసట ఎక్కువగా కనిపిస్తాయి.