తెలుగు ప్రేక్షకులకు సినీ నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 2003లో ఎవరే ఆటగాడు మూవీతో ప్రియమణి సినీ జర్నీ మొదలైంది.
2007లో రిలీజైన పరుత్తివీరన్ సినిమాలో ముత్తళగు క్యారెక్టర్ లో ఆమె చూపించిన ఎమోషనల్ యాక్టింగ్ ఆడియన్స్ ను ఎంతగానో మెప్పిచింది.
పరుత్తివీరన్ సినిమాకు గానూ ప్రియమణికి నేషనల్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా లభించాయి.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో ప్రియమణి తనదైన ముద్ర వేసింది.
20ఏళ్లకు పైగా నటిగా సత్తా చాటుతున్న ప్రియమణి, కేవలం నటిగానే కాకుండా పలు షోలకు కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రియమణి చేతిలో పలు సినిమాలుండగా, ఆమె నటించిన సరస్వతి సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన Priyamani, ప్రతి పాత్రలో సహజ నటనతో మెప్పిస్తోంది.