ఇంట్లో శాంతి, సంపద కోసం వాస్తు ప్రకారం ఈ మొక్కలు బెస్ట్..

30th March 2026

White Scribbled Underline

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న మార్పులు కూడా పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ముఖ్యంగా కొన్ని మొక్కలను పెంచితే ఇంట్లో శాంతి, సంపద పెరుగుతాయని నమ్మకం.

గులాబీ మొక్కలు ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే సంబంధాలు బలపడతాయని చెబుతారు.

లక్ష్మీదేవికి గులాబీలు ఇష్టమని నమ్మకం ఉంది. అందుకే వీటిని పెంచితే ఆర్థికంగా కూడా లాభం ఉంటుందని అంటారు.

మల్లె మొక్కలు ఇంటికి మంచి సువాసన ఇస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

ఎర్రని మందార మొక్కలు శుభ సూచకంగా భావిస్తారు. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయని విశ్వాసం.

బిళ్లగన్నేరు మొక్కలు ఏడాది పొడవునా పూలు ఇస్తాయి. ఇవి కుటుంబంలో ఆనందాన్ని పెంచుతాయని అంటారు.

బంతిపూలు ఇంటి వాతావరణాన్ని చక్కగా మార్చుతాయి. ఇవి సానుకూలతను పెంచి అనుబంధాలను బలపరుస్తాయి.

తులసి మొక్క చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండటం వల్ల శాంతి, ఆరోగ్యం పెరుగుతాయని నమ్మకం.

మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని విశ్వాసం.మనీ ప్లాంట్‌ను ఇండోర్‌లో కూడా పెంచవచ్చు