మీన రాశి వారు మార్చిలో ఎదుర్కోబోయే 5 ప్రధాన సమస్యలు - పరిష్కారాలివే

3rd March 2026

White Scribbled Underline

మార్చి 2026లో మీన రాశిలో రాహువు మరియు సూర్యుడి సంచారం వల్ల కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు.

రాహువు ప్రభావం వల్ల ఈ నెలలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడవచ్చు. అనవసరమైన భయాందోళనలు, నెగటివ్ ఆలోచనలు మనసును కలవరపెట్టవచ్చు

ఆదాయం బాగున్నా, ఊహించని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా విలాసాలకు లేదా అనారోగ్య కారణాల వల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది.

ఈ నెలలో నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది.

మీ పనితీరును చూసి సహోద్యోగులు లేదా బంధువుల్లో అసూయ పెరగవచ్చు. దీనివల్ల చేసే పనుల్లో అకస్మాత్తుగా ఆటంకాలు (నర దిష్టి) ఎదురవుతాయి.

ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం లేదా "ఓం నమః శివాయ" మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాహు దోషం తగ్గుతుంది.

శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం మంచిది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుంది.