ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బీఆర్ఎస్ కు షాకుల మీద షాక్ లు..

బీఆర్ఎస్ కు షాకుల మీద షాక్ లు..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య... వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీసీఎం కడియం కావ్య పేరును గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది.

కడియం కావ్య రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. గత కొన్నిరోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి, భూకబ్జా, ఫోన్ ట్యాపింగ్ తో పాటు లిక్కర్ స్కామ్ విషయాల్లో అనేక వార్తలు వస్తున్నాయని..ఇలాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని కడియం కావ్య తన లేఖలో చెప్పారు. ఇక నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది పార్టీకి మరింత నష్టం చేస్తుందని.. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు కావ్య.

కాగా, రెండు రోజుల క్రితమే గా కడియం కావ్య.. కేసీఆర్ ను కలిసి తనను బీఆర్ఎస్ తరపున వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇంతలోనే ఆమె తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, కడియం కావ్య తండ్రి అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే బీఆర్ఎస్ మెయిన్ వాయిస్ గా కడియం ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించారు.

అయితే కుమార్తె కావ్య పోటీ నుంచి తప్పుకోవటం వెనక శ్రీహరి నిర్ణయం ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆఫర్ వచ్చిందని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె త్వరలో హస్తం గూటికి చేరే అవకాశమున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్ కూడా ఇంకా వరంగల్ ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేకపోలేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :