ASBL NSL Infratech

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా,  క్రేజీ థ్రిల్లర్ 'బాక్' మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా,  క్రేజీ థ్రిల్లర్ 'బాక్' మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్.  

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.  మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  'పంచుకో' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :