అంజలి ప్లానింగ్ సూపర్బ్
తెలుగమ్మాయే అయినప్పటికీ కోలీవుడ్ లో మంచి పాపులర్ అయిన అంజలి సొంత భాష అయిన తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. తెలుగమ్మాయిగా హీరోయిన్ గా సక్సెస్ అయిన వాళ్లలో అంజలి కూడా ఉంటుంది. ఈ మధ్యే తన 50వ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చిందితో ప్రేక్షకులని పలకరించిన అంజలి కొత్త ప్లాన్ మిగిలిన హీరోయిన్లకు షాక్ ఇస్తుంది.
ఇప్పటివరకు మంచి సినిమాలే చేయాలి, హిట్స్ కొట్టాలనుకున్న అంజలి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక పై ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లోనే నటించాలని అంజలి ఫిక్సయిందట. టాలీవుడ్ లో డిఫరెంట్ కథలను ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. అందుకే అంజలి అలాంటి సినిమాలతోనే ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తుంది.
ఎలాగూ కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులొచ్చే అవకాశం లేదని భావిస్తున్న అంజలి ఇక మీదట తాను కూడా కొత్త ప్రయోగాలు చేయాలని ఫిక్స్ అయిందట. అంజలి చేస్తాననాలే కానీ ఆమె కోసం కొత్త కథలు రాయడానికి డైరెక్టర్లు, రచయితలు రెడీగా ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్న అంజలి ప్రయత్నం ఏదో రోజు సక్సెస్ అవక మానదు. మరి అంజలి కోరుకుంటున్న ఆ హిట్ అమ్మడికి ఎంత దూరంలో ఉందో.