మన రోజువారీ అలవాట్లు తెలియకుండానే దంతాల రంగుపై ప్రభావం చూపుతాయి. చిన్నచిన్న నిర్లక్ష్యాలు దంతాలు పసుపుగా మారడానికి కారణమవుతాయి.
చాలా సార్లు టీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దంతాలపై మచ్చలు పడతాయి. ఇవి క్రమంగా పసుపు రంగుకు మారుతాయి.
పొగ త్రాగడం దంతాల రంగును చెడగొట్టే ప్రధాన కారణం. నికోటిన్ వల్ల పళ్లు పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతాయి.
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోవడం వల్ల ప్లాక్ చేరుతుంది. ఇది దంతాలను మురికి రంగులోకి మార్చుతుంది.
నీరు తక్కువగా తాగడం కూడా ప్రభావం చూపుతుంది. నోరు ఎండిపోతే బ్యాక్టీరియా పెరిగి దంతాలు పసుపుగా మారుతాయి.
తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల దంతాలపై మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాలక్రమేణా రంగు మార్పుకు దారి తీస్తాయి.
సరైన విధంగా నోరు శుభ్రం చేయకపోవడం కూడా సమస్యను పెంచుతుంది. భోజనం తర్వాత గార్గిల్ చేయకపోతే మలినాలు పేరుకుపోతాయి.
సాఫ్ట్ డ్రింక్స్, కలర్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం దంతాల ఎమల్షన్‌ను దెబ్బతీస్తుంది. దీని వల్ల పసుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది.
సమయానికి డెంటిస్ట్‌ను సంప్రదించకపోవడం వల్ల సమస్య పెరుగుతుంది. చిన్న సమస్యలు పెద్దవిగా మారి దంతాల అందాన్ని తగ్గిస్తాయి.