మార్నింగ్ తినకూడని సెవెన్ ఫుడ్స్ ఇవే..

22nd April 2026

White Scribbled Underline

ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం చాలామందికి అలవాటు. కానీ ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటే ఆమ్లత్వం పెరిగి కడుపులో ఇబ్బంది కలగవచ్చు.

సిట్రస్ ఫలాలు వంటి నారింజ, నిమ్మ వంటి వాటిని ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. ఇది కొందరిలో ఆసిడ్ని పెంచి ఉదర సంబంధిత సమస్యలకు దారితీస్తాయి.

కారంగా ఉన్న ఆహారం కూడా ఉదయం మొదటిగా తినడం సరైంది కాదు. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచి అసౌకర్యం కలిగించవచ్చు.

చల్లని పానీయాలు లేదా సోడా డ్రింక్స్ ఖాళీ కడుపుతో తీసుకుంటే గ్యాస్ సమస్యలు , అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది.

పెరుగు కూడా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది కాదు. ఇది కడుపులో ఆమ్ల స్థాయిని ప్రభావితం చేయవచ్చు.

బనానా వంటి కొన్ని పండ్లు ఖాళీ కడుపుతో తినడం వల్ల మెగ్నీషియం స్థాయులు అకస్మాత్తుగా పెరిగి గుండె పనితీరుపై ప్రభావం చూపవచ్చు.

చివరగా, ప్యాకెట్ ఫుడ్స్ లేదా ప్రాసెస్డ్ స్నాక్స్ ఉదయం తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరిగి శరీరానికి హాని కలగవచ్చు. ఆరోగ్యకరమైన అల్పాహారం ఎప్పుడూ మంచిది.