సమ్మర్ హాలిడేకు బెస్ట్ డెస్టినేషన్ ఊటీ విశేషాలు ఇవే..

26th March 2026

White Scribbled Underline

వేసవి సెలవుల్లో చల్లని ఫ్యామిలీ ట్రిప్ కోసం ఊటీ మంచి ఎంపిక. ప్రకృతి అందాలు, తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ప్రదేశాన్ని సమ్మర్ ట్రిప్‌కు సరైన డెస్టినేషన్‌గా మారుస్తాయి.

ఊటీ బోటానికల్ గార్డెన్ వేసవిలో పూలతో కళకళలాడుతుంది. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి ఇది మంచి ప్రదేశం.

ఊటీ సరస్సు వద్ద పడవ ప్రయాణం సమ్మర్‌లో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. చల్లని గాలితో సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

డోడాబెట్టా పీక్ నుండి చుట్టూ ఉన్న పర్వతాల అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. టూర్ లో కాస్త అడ్వెంచర్ కావాలనుకునే వారికి ఇప్పడు ట్రాకింగ్ మంచి మజా ఇస్తుంది.

రోజ్ గార్డెన్‌లో వివిధ రకాల గులాబీ పూలు చూసి ఫోటోలు తీసుకోవచ్చు. ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ.

కూనూర్ సమీపంలో ఉండే టీ తోటలు వేసవిలో కూడా చల్లని అనుభూతిని ఇస్తాయి. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్ వంటి ప్రదేశాలు ప్రకృతి ప్రేమికులకు తప్పక చూడాల్సినవి. ఇవి సమ్మర్ ట్రిప్‌ను మరింత గుర్తుండేలా చేస్తాయి.

పైకారా జలపాతం, చుట్టుపక్కల హిల్ ప్రాంతాలు కూడా సందర్శించవచ్చు. ఊటీ ట్రిప్ మీ వేసవి సెలవులను ప్రత్యేకంగా మార్చుతుంది.