ధురంధర్ మూవీలో హీరో పాత్ర ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసు.
ఇండియా ఒరిజినల్ బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ రియల్ లైఫ్ అంతకంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది.
1952 ఏప్రిల్ 11న రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో రవీంద్ర కౌశిక్ పుట్టారు.
సరిహద్దు ప్రాంతంలో పెరిగి, పంజాబీ & స్థానిక భాషల్లో నైపుణ్యం సంపాదించారు.
థియేటర్ల ఆర్టిస్ట్ అయిన రవీంద్ర లక్నోలో చేసిన మోనో యాక్ట్ RAW అధికారులను ఆకట్టుకుంది.
రవీంద్ర టాలెంట్ ను గుర్తించిన RAW దేశసేవ కోసం గూఢచారి మార్గంలోకి తీసుకెళ్లింది.
ఢిల్లీలో 2 ఏళ్ల పాటూ ట్రైనింగ్ ఇచ్చి ఇస్లామిక్ సంప్రదాయాలు, పాకిస్తాన్ జీవనశైలి నేర్పించి నబీ అహ్మద్ షాకిర్ గా మార్చారు.
1975లో పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో లా చదివి, సమాజంలో కలిసిపోయారు.
పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ అకౌంట్స్‌లో చేరి మేజర్ హోదా వరకు ఎదిగి అరుదైన ఘనత సాధించారు. రవీంద్ర దేశానికి చేసిన సేవకు అధికారిక గుర్తింపు లేదని ఇప్పటికీ అతని ఫ్యామిలీ న్యాయం కోసం ఎదురు చూస్తోంది.