ఆన్‌లైన్ షాపింగ్‌లో డబ్బు సేవ్ చేయాలా? ఈ 5 కూపన్ కోడ్ ట్రిక్స్ ఉపయోగించండి..

5th March 2026

White Scribbled Underline

ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు చాలా మంది రోజువారీ జీవితంలో భాగమైంది. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో కొన్ని సీక్రెట్ కూపన్ ట్రిక్స్ ఉపయోగిస్తే తక్కువ ధరకే వస్తువులు పొందవచ్చు.

మొదటగా ప్రోడక్ట్ పేజీలో కనిపించే “కూపన్ క్లిప్” ఆప్షన్‌ను ఉపయోగించాలి. దీనిని క్లిక్ చేస్తే వెంటనే 5% నుంచి 20% వరకు డిస్కౌంట్ ధరలోనే తగ్గుతుంది.

బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కూడా ఒక రహస్య కూపన్ లాంటివే. హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ zఐసిసిఐ  వంటి బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే 5% నుంచి 10% వరకు అదనపు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది.

పెద్ద సేల్ సమయాల్లో “ఫెస్టివల్ కూపన్లు” వస్తాయి. ఉదాహరణకు బిగ్ బిలియన్ డేస్  లేదా  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్l సమయంలో ప్రోడక్ట్ డిస్కౌంట్‌తో పాటు ప్రత్యేక కూపన్ కూడా లభిస్తుంది.

ప్రైమ్ మెంబర్ లేదా యాప్ యూజర్ అయితే కొన్ని ప్రత్యేక కూపన్లు లభిస్తాయి. ఇవి సాధారణ యూజర్లకు కనిపించకపోవచ్చు కాబట్టి ముందుగా యాప్‌లో ఆఫర్లను చెక్ చేయడం మంచిది.

యూపీఐ, వాలెట్ పేమెంట్స్ ఉపయోగించినప్పుడు కూడా అదనపు క్యాష్‌బ్యాక్ లభించవచ్చు.  పేటీఎం ,ఫోన్ పే లేదా  అమెజాన్ పే ద్వారా చెల్లిస్తే అదనపు డిస్కౌంట్ లభించే అవకాశముంది.

ఈ చిన్న ట్రిక్స్‌ను ఉపయోగిస్తే అదే ప్రోడక్ట్‌ను మరింత తక్కువ ధరలో పొందవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్‌లో కూపన్లు, క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లను కలిపి ఉపయోగిస్తే మంచి సేవింగ్ సాధ్యమవుతుంది.

CLICK HERE