తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. మార్చి 11న ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్లో రేపు గరిష్ట ఉష్ణోగ్రత 33°C, కనిష్టంగా 22°C నమోదు కావచ్చు. ఆకాశం నిర్మలంగా, పొడిగా ఉంటుంది.
విజయవాడలో ఎండలు మండిపోనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 37°C నుండి 38°C వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
విశాఖలో ఉష్ణోగ్రత 28°C వరకు ఉండవచ్చు. ఉదయం వేళల్లో కాస్త మేఘావృతమై ఉన్నా, మధ్యాహ్నం వేడి పెరుగుతుంది.
తిరుపతి, అనంతపురం, నంద్యాల ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 36°C దాటే ఛాన్స్ ఉంది.
నెల్లూరు జిల్లాలో కూడా పొడి వాతావరణం ఉంటుంది. వేడి గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లోనూ వర్ష సూచన లేదు. మెజారిటీ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.