దశరథ్ మంజి - బీహార్లోని గయా జిల్లాకు చెందిన సాధారణ కార్మికుడు పేదరికంలో జన్మించినా, హృదయంలో పెద్ద కలలు ఉన్న మనిషి.
ఆయన భార్య ఫల్గుని దేవి అనారోగ్యానికి గురయ్యింది. ఆసుపత్రికి వెళ్లాలంటే కొండ చుట్టూ 55 కి.మీ ప్రయాణం తప్పలేదు. సమయానికి చికిత్స అందక ఆమె మరణించింది.
భార్య మరణం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఇక ఎవరూ నా భార్య లాగా మరణించకూడదు” ఒక సుత్తి, ఒక ఉలి, అచంచలమైన సంకల్పం… అంతే ఆయన ఆయుధాలు.
1960లో మొదలైన ప్రయాణం… రోజుకు గంటల తరబడి కష్టపడి 22 సంవత్సరాలు ఆపకుండా పనిచేశారు.
360 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పు 25 అడుగుల ఎత్తు ఒక రహదారి ఏర్పడింది!
55 కి.మీ దూరం → కేవలం 15 కి.మీకి తగ్గింది. గ్రామస్తులకు ఆసుపత్రి, పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రపంచం ఆయనను “మౌంటెన్ మ్యాన్” అని పిలిచింది. ఆయన కథపై 2015లో ఒక సినిమా కూడా వచ్చింది.
ప్రేమ ఉంటే అసాధ్యం ఏదీ కాదు. ఒక మనిషి సంకల్పం… ఒక గ్రామ భవిష్యత్తును మార్చింది!
తాజ్మహల్ ప్రేమకు ఒక స్మారక చిహ్నం. దశరథ్ మంజి యొక్క మార్గం ప్రేమకు ఒక జీవన మార్గం.