ఆ వీధుల్లో తిరిగితే వ‌చ్చే కిక్కే వేరు

16th February 2026

White Scribbled Underline

సందీప్ కిష‌న్ తో క‌లిసి సూప‌ర్ సుబ్బు అనే ప్రాజెక్టు తో త్వ‌ర‌లోనే నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతుంది మిథిలా పాల్క‌ర్.

రీసెంట్ గ‌రా హ్యాపీ ప‌టేల్ అనే బాలీవుడ్ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మిథిలా, ప్ర‌స్తుతం హిందీలో భూత్ బంగ్లాలో న‌టిస్తోంది.

ఓ వైపు సినిమాలు చేస్తూ ఖాళీ టైమ్స్ లో వెకేష‌న్స్ కు వెళ్లే మిథిలాకు ట్రిప్ అంటే లండ‌నే గుర్తొంద‌ని, అక్క‌డ వీధుల్లో తిరిగితే మంచి కిక్కొస్తుంద‌ని చెప్తోంది.

వాట‌ర్ స‌ర్ఫింగ్ అంటే కూడా మిథిలాకు ఇంట్రెస్ట్ ఎక్కువ‌ట‌. వీలున్న‌ప్పుడ‌ల్లా ఫ్రెండ్స్ తో క‌లిసి స‌ర్ఫింగ్ కు వెళ్తుంద‌ట అమ్మ‌డు.  

స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ల‌కు వెళ్లి అక్క‌డ మ‌న ప్లేయ‌ర్స్ ను ఎంక‌రేజ్ చేయ‌డం కూడా మిథిలాకు ఎంతో ఇష్ట‌మట‌.

చెన్నై దోశ‌, ఫిల్ట‌ర్ కాఫీ అంటే ఇష్ట‌మంటున్న మిథిలా, అక్క‌డికి వెళ్తే త‌ప్ప‌కుండా వాటిని ఆస్వాదిస్తానంటోంది.

సహజ నటనతో యువతలో మంచి ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న మిథిలా పాల్కర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది.

ట్రావెలింగ్, ఫుడ్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను తరచూ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తనదైన ముద్ర వేసిన మిథిలా, వెర్సటైల్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.