గుంటూరు మిర్చి తింటే అల్సర్ వస్తుందా?

24th February 2026

White Scribbled Underline

గుంటూరు మిర్చి భారతీయ వంటల్లో ప్రత్యేక రుచి, సువాసనను ఇస్తుంది. అయితే, ఆహారంలో ఎక్కువ ఘాటనిచ్చే గుంటూరు మిర్చి వాడడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

అయితే మిర్చి తినడం నేరుగా అల్సర్‌కు కారణం అవ్వదు. అల్సర్ ప్రధానంగా జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి, పొగాకు, మద్యం వంటి అంశాల వల్ల ఏర్పడుతుంది.

అధిక మసాలా, కారం ఉన్న  వంటకాలను ఎక్కువగా తీసుకోవడం, పౌష్టికాహారం లోపించడం లేదా పొట్టకు హానికరమైన ఇతర అలవాట్లు అల్సర్ రిస్క్ ను పెంచుతాయి.

గుంటూరు మిర్చి ఎక్కువగా తింటే కొందరికి పొట్టలో మంట, అసహనము, అజీర్ణ సమస్యలు కనిపించవచ్చు. ఇది ప్రతి వ్యక్తికి వేరుగా ఉంటుంది.

అల్సర్ ఉన్నవారు మిర్చి తక్కువగా తినాలి. ఎక్కువగా తింటే గ్యాస్, అజీర్తి పెరిగి, అల్సర్ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. 

సరైన ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు పాటిస్తే, మిర్చి వల్ల అల్సర్ వచ్చే అవకాశం అత్యల్పంగా ఉంటుంది, కాబట్టి మిర్చిని పూర్తిగా తప్పించాల్సిన అవసరం లేదు.

ఫాలో అవ్వండి.

గుంటూరు మిర్చి రైతులకు గట్టి దెబ్బ… 

చిరంజీవి సొంత ఊరు మొగల్తూరు ........