ఇంట్లో తయారు చేసుకునే షుగర్ నియంత్రణ పానీయాలు తక్కువ క్యాలరీ, చక్కెర రహితంగా ఉంటే ఆరోగ్యానికి మంచివి. ఇవి రక్తంలో షుగర్ స్థాయిలను సమతుల్యం చేసి, శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
దాల్చిన చెక్క మరిగించిన నీరు బ్లడ్లో షుగర్ నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపులో తాగడం మంచిది.
ఓవర్నైట్ నానబెట్టిన మెంతి నీరు షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది . ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది.
కాకరకాయ రసం రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. ఇందులో ఆక్సిడెంట్ లక్షణాలు షుగర్ లెవెల్స్ సమతుల్యం చేస్తాయి.
గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. రోజూ 1-2 కప్పులు తాగడం మంచిది.
క్యుకంబర్ లేదా నిమ్మరసం కలిపిన నీరు శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది. ఇది రక్తంలో షుగర్ స్పైక్ లేకుండా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జమ ఆకుల కషాయం, అల్లం పసుపు నీరు కూడా షుగర్ ను కంట్రోల్ ఉంచుతాయి. అయితే ఇవి నిపుణుల సలహా తో నిర్ణీత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
ఆపిల్ సిడర్ వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ స్థాయిల నియంత్రణకు సహాయపడుతుంది.