నేటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం

25th March 2026

White Scribbled Underline

భాగ్యనగరంలో నేడు గరిష్ట ఉష్ణోగ్రత 34°Cగా ఉండనుంది. సాయంత్రం వేళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, తేలికపాటి చినుకులు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ అప్డేట్

సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

 తెలంగాణ జిల్లాల్లో అలెర్ట్

ఏపీ రాజధాని అమరావతిలో నేడు గరిష్టంగా 36°C ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. ఉదయం వేళ పొగమంచు కురిసే అవకాశం ఉంది, పగలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.

అమరావతి వాతావరణం

శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

ఉత్తర ఆంధ్ర అలెర్ట్

నంద్యాల, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38°C దాటే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన.

రాయలసీమలో ఎండలు

కోస్తా తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.

బలమైన ఈదురు గాలులు