షుగర్ సమస్య ఉన్నవారు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సరైన ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
చక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిలు, స్వీట్లు పూర్తిగా తగ్గించడం మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి.
తెల్ల బియ్యం, మైదా పదార్థాలు కూడా పరిమితంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ను త్వరగా పెంచుతాయి.
సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్‌లు వంటి పానీయాలు దూరంగా ఉంచాలి. వీటిలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది.
ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించడం మంచిది. ఇవి ఆరోగ్యానికి హానికరం.
బేకరీ ఐటమ్స్, కేక్స్, బిస్కెట్లు కూడా ఎక్కువగా తినకూడదు. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి.
రోజూ సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది.
తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, స్ప్రౌట్స్, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడంతో పాటు సరియైన వ్యాయామాన్ని కూడా లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకోవాలి.
వైద్యుల సూచనలు పాటిస్తూ, సరైన డైట్ పాటిస్తే ఆరోగ్యంగా జీవించవచ్చు. చిన్న జాగ్రత్తలతో పెద్ద సమస్యలను దూరం పెట్టవచ్చు.