ఆ ఇన్సిడెంట్ ఆమె జీవితాన్నే మార్చేసింది

3rd March 2026

White Scribbled Underline

సుధీర్ బాబు హీరోగా వ‌చ్చిన న‌న్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది న‌భా న‌టేష్.

మొద‌టి సినిమాతో ఆడియ‌న్స్ ను త‌న న‌ట‌న‌తో మెప్పించిన న‌భా, త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఖాతాలో వేసుకుంది.

ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత న‌భాకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న టైమ్ లోనే అమ్మ‌డి లైఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది.

అనుకోని యాక్సిడెంట్ జ‌ర‌గ‌డంతో న‌భా న‌టేష్ చాలా కాలంపాటూ సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది.

ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ స్వ‌యంభు, నాగ బంధం అనే రెండు సినిమాల్లో న‌టిస్తోంది.

ఈ సినిమాల‌తో పాటూ న‌భా మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆ యాక్సిడెంట్ జ‌ర‌క్కుండా ఉండి ఉంటే న‌భా కెరీర్లో స్టార్ హీరోయిన్ అయి ఉండేది.

యాక్సిడెంట్ త‌ర్వాత ఫిట్‌నెస్ పై ఫోక‌స్ పెట్టిన న‌భా, పూర్తిగా కోలుకుని మ‌రింత స్ట్రాంగ్ గా రీ-ఎంట్రీ ఇచ్చేందుకు కృషి చేస్తోంది.

కష్టకాలం ఆమెకు చాలా పాఠాలు నేర్పిందని, ఇకపై స్క్రిప్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.