తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు! ఈ రోజు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ రోజు హైదరాబాద్ లో వేడి గాలులు.. గరిష్టంగా ఉష్ణోగ్రత 38°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల స్వల్ప ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం
విజయవాడలో తీవ్రమైన ఉక్కపోత గరిష్టంగా 38°C ఉష్ణోగ్రత నమోదు కావచ్చు.
వైజాగ్లో నేడు వాతావరణం ఎండతో పాటు ఉక్కపోత అధికంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 34–36°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు ఎండలో తిరగవద్దు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించండి. ఎండ దెబ్బ తగలకుండా చూసుకోండి.