సమ్మర్ సీజన్‌లో ఎర్రగా, తాజా టమాటాలు ఎక్కువగా లభిస్తాయి. వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి టేస్టీగా టమాటో పచ్చడి చేసుకోవచ్చు.
టమాట పచ్చడి అనేది చాలా సులభంగా చేసుకునే రుచికరమైన వంటకం. అన్నం, దోశ,ఇడ్లీ ఇలా వేటితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ముందుగా టమాటలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. వాటిని పాన్‌లో వేసి నీరు ఆరే వరకు వేపాలి.
ఇప్పుడు వేరే పాన్‌లో నూనె వేడి చేసి ధనియాలు ,ఎండుమిర్చి వేయాలి. తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.
వేపిన టమాట ముక్కలను ఇందులో వేసి ఉప్పు, కారం, పసుపు కలిపి బాగా కలపాలి. మిశ్రమం గట్టిగా అయ్యే వరకు ఉంచాలి.
చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తిరిగి కడాయిలో నూనె వేడి చేసి అందులో పోపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించాలి.
ఈ పచ్చడిని చల్లారిన తర్వాత నిల్వ చేసుకోవచ్చు. కొద్దిగా నూనె ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటుంది.
టమాటలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.