10th June 2026

__________

- Saidulu

ప్రతి ముద్దలో మధురమైన రుచిని ఆస్వాదింపజేసే పప్పు పొన్నగంటి కూర..

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాతకాలపు వంటకం పొన్నగంటి కూర పప్పు. కంటి చూపును మెరుగుపరిచే ఈ కమ్మని వంటకాన్ని ఈరోజు నేర్చుకుందాం.

తాజా పొన్నగంటి ఆకులు, ఒక కప్పు కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, పోపు దినుసులు మరియు నెయ్యి సిద్ధం చేసుకోండి.

కావలసిన పదార్థాలు

కందిపప్పును బాగా కడిగి, అరగంట పాటు నీళ్లలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడకడమే కాకుండా చాలా మెత్తగా వస్తుంది.

పప్పు నానబెట్టడం

పొన్నగంటి ఆకులను కాడల నుండి వేరు చేసి, ఇసుక లేకుండా నీళ్లలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.

ఆకుకూర తయారీ

కుక్కర్‌లో నానిన కందిపప్పు, పొన్నగంటి ఆకులు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు మరియు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టండి.

ఉడికించడం

కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై 3 నుండి 4 విజిల్స్ రానివ్వండి. పప్పు మరియు ఆకుకూర పూర్తిగా మెత్తగా ఉడకాలి.

విజిల్స్ రానివ్వాలి

ప్రెజర్ పోయాక మూత తీసి, అందులో తగినంత ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు రసం వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి.

పప్పు ఎనపడం

బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేయించండి.

కమ్మని పోపు

వేగిన పోపులో మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పొన్నగంటి పప్పును వేసి బాగా కలిపి, ఒక్క నిమిషం పాటు తక్కువ మంటపై ఉంచండి.

పప్పు కలపడం

ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పప్పు పొన్నగంటి కూర రెడీ! వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది.