ఐశ్వర్యా రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఆమె తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది.
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా నటించి బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుంది ఐశ్వర్య.
ఆ సినిమా తర్వాత ఐశ్వర్య వరుస అవకాశాలతో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ అమ్మడికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాక కెరీర్లో ఇబ్బంది పడుతుంది.
ఐశ్వర్య తండ్రి రాజేష్ 80స్ లో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అనే విషయం అందరికీ తెలిసిందే.
తెలుగులో మంచి టాలెంట్ ఉన్న నటిగా గుర్తింపు పొందినప్పటికీ ఐశ్వర్యకు పెద్ద ప్రాజెక్టులు మాత్రం వరుసగా రాలేదు.
మంచి కథలు వస్తే తెలుగు సినిమాల్లో కూడా మరిన్ని అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.