ఏప్రిల్ 13, 2026 సోమవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయడం ప్రత్యేకంగా భావించబడుతోంది.ధనిష్ఠ నక్షత్ర ప్రభావంతో పాటు బుధుడి అనుగ్రహం కొన్ని రాశులకు లాభాలను అందించనుంది.
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఖర్చులు పెరిగినా పెండింగ్ పనులు పూర్తవుతాయి.సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది.
మేష రాశి
వృషభ రాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
వృషభ రాశి
మిథున రాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది.ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహాయం ఉంటుంది.
మిథున రాశి
కర్కాటక రాశి వారికి శుభయోగాల ప్రభావంతో విజయం సాధించే అవకాశం ఉంది. శత్రువులపై పైచేయి ఉంటుంది.ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా లాభాలు రావచ్చు.
కర్కాటక రాశి
సింహ రాశి వారికి ఈరోజు జాగ్రత్త అవసరం. పనుల్లో అడ్డంకులు రావచ్చు.ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో మద్దతు లభిస్తుంది.
సింహ రాశి
కన్య రాశి వారికి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. స్నేహితుల సహకారం పొందుతారు.
కన్య రాశి