మంచి నిద్ర కోసం సరైన భంగిమ..ఆరోగ్యానికి ఇవే బెస్ట్..

24th April 2026

White Scribbled Underline

మంచి ఆరోగ్యం, నాణ్యమైన నిద్ర కోసం సరైన నిద్రపోయే విధానం చాలా ముఖ్యం. సరైన పొజిషన్‌లో నిద్రపోతే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

ఎడమ వైపు తిరిగి పడుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది గుండెపై ఒత్తిడి తగ్గించి శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.

వెనుక భాగంపై సూటిగా పడుకోవడం వెన్నెముకకు మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇది నడుము నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

తల కింద సరైన దిండు వాడటం చాలా అవసరం. ఇది మెడకు సరైన మద్దతు ఇచ్చి నొప్పులను తగ్గిస్తుంది.

కుడి వైపు పడుకోవడం కూడా కొంతమందికి అనుకూలంగా ఉంటుంది.కానీ ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఈ పొజిషన్లో పడుకోవడం మంచిది కాదు.

పొట్ట మీద పడుకోవడం అసలు మంచి అలవాటు కాదు. ఇది మెడ, వెన్నుపూసపై ఒత్తిడి పెంచుతుంది.

నిద్రకు ముందు మొబైల్, టీవీ వినియోగం తగ్గించడం అవసరం. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి మంచి నిద్రకు దోహదపడుతుంది.

సరైన నిద్ర అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.