వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగి నియంత్రణలో లేకపోవడం వల్ల ఏర్పడే తీవ్రమైన పరిస్థితి.
తలనొప్పి, వికారం , జ్వరం,బలహీనత హీట్ స్ట్రోక్‌కి ప్రారంభ లక్షణాలుగా కనిపించవచ్చు. శరీరం అలసటగా అనిపించడం కూడా ఒక ముఖ్య సంకేతం.
అధిక జ్వరం (40°C వరకు), చెమట తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం గమనించాలి. చర్మం ఎండిపోయి వేడిగా అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
వాంతులు, వికారం, గందరగోళం లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు తీవ్రమైన స్థితిని సూచిస్తాయి. ఈ పరిస్థితిలో తక్షణ వైద్య సహాయం అవసరం.
హృదయ స్పందన వేగంగా మారడం, శ్వాసలో ఇబ్బంది కలగడం కూడా ప్రమాద సూచనలు. చిన్నపిల్లలు, వృద్ధులు, బయట ఎండలో పని చేసే వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
హీట్ స్ట్రోక్ నివారణకు తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం, తేలికపాటి దుస్తులు ధరించడం అవసరం. లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించడం మంచిది.