20 నిమిషాల్లోనే డీల్ క్లోజ్ అంటున్న హ‌రీష్ శంక‌ర్ 

4th March 2026

White Scribbled Underline

మార్చి నెలలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న అవైటెడ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఒక‌టి.

ఓజి లాంటి స్టైలిష్ హిట్ త‌ర్వాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న ఫుల్ లెంగ్త్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డంతో ఈ మూవీని స్పెష‌ల్ గా ఫీల‌వుతున్నారు ఫ్యాన్స్.

మార్చి 26న రిలీజ్ కానున్న ఈ సినిమాకు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఆల్రెడీ ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టాడు. 

ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంద‌ని, కేవ‌లం 20 నిమిషాల్లోనే ఆ డీల్ క్లోజ్ అయింద‌ని హ‌రీష్ చెప్పాడు.

కంటెంట్ పై ఉన్న న‌మ్మ‌కంతోనే ఈ డీల్ జ‌రిగిన‌ట్టు ఆయన చెప్ప‌గా, ఓటీటీ రిలీజ్ టైమింగ్ గురించి మాత్రం ఆయ‌న క్లారిటీ ఇవ్వ‌లేదు. 

శ్రీలీల‌, రాశీ ఖ‌న్నా హీరోయిన్లు గా న‌టిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా, మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మించింది