27th April 2026

____________

- Saidulu

మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అలవాట్లు..

సోషల్ మీడియా చూస్తూ ఇతరుల జీవితంతో మిమ్మల్ని పోల్చుకోకండి. ఇది మీలోని ప్రత్యేకతను గుర్తించకుండా అడ్డుకుంటుంది.

ఇతరులతో పోల్చుకోవడం

పాత ఓటములను పదే పదే తలచుకోవడం వల్ల భవిష్యత్తుపై భయం పెరుగుతుంది. తప్పుల నుండి పాఠం నేర్చుకుని ముందుకు సాగండి.

గతంలోని తప్పులనే తలచుకోవడం

"నేను ఇది చేయలేను", "నాకు అంత సీన్ లేదు" అని మీకు మీరే చెప్పుకోవడం మానేయండి. మీ మాటలే మీ వ్యక్తిత్వాన్ని మలుస్తాయి.

నెగటివ్ సెల్ఫ్-టాక్ (Self-Talk)

ప్రతి పని పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఒత్తిడి (Perfectionism) వల్ల భయం పెరుగుతుంది. పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి.

పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం

పనులను వాయిదా వేయడం (Procrastination) వల్ల చివరి నిమిషంలో ఒత్తిడి పెరిగి, మీ సామర్థ్యంపై మీకే అనుమానం కలుగుతుంది.

వాయిదా వేసే పద్ధతి

ఎవరో ఏదో అన్నారని గంటల తరబడి ఆలోచించకండి. నిర్మాణాత్మక విమర్శలను తీసుకోండి, అనవసరమైన వాటిని వదిలేయండి.

విమర్శలకు అతిగా స్పందించడం

అందరినీ మెప్పించాలని ప్రతిదానికీ 'ఎస్' అనకండి. మీ సొంత అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆత్మగౌరవం తగ్గుతుంది.

'నో' చెప్పలేకపోవడం