పండుగైనా, పార్టీయైనా గులాబ్ జామూన్ ఉంటే ఆ మజానే వేరు. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ స్వీట్.
కోవా లేదా జామూన్ మిక్స్‌తో పిండిని గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోవాలి. అప్పుడే జామూన్లు సాఫ్ట్‌గా వస్తాయి.
పిండిని చిన్న ఉండలుగా చుట్టేటప్పుడు అస్సలు పగుళ్లు (cracks) ఉండకూడదు. పగుళ్లు ఉంటే నూనెలో వేయించినప్పుడు విడిపోతాయి.
నీళ్లలో చక్కెర వేసి, ఒక మోస్తరు జిగురు వచ్చే వరకు మరిగించాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేస్తే మంచి సువాసన వస్తుంది.
జామూన్లను నెయ్యి లేదా నూనెలో తక్కువ మంట (low flame) మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సమానంగా వేయించుకోవాలి.
వేయించిన జామూన్లను గోరువెచ్చని చక్కెర పాకంలో వేయాలి. కనీసం 30 నిమిషాలు నానితే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి.
జామూన్లపై బాదం, పిస్తా ముక్కలను చల్లి సర్వ్ చేస్తే చూడటానికి అందంగా, తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుంది.
వేడివేడి గులాబ్ జామూన్‌ను చల్లని వనిల్లా ఐస్‌క్రీమ్‌తో కలిపి తింటే ఆ రుచి అద్భుతం. ఇది మోడ్రన్ హిట్ కాంబినేషన్!