వరంగల్ అంటే కేవలం కట్టడాలు కాదు రా బిడ్డా… జొన్న రొట్టె – కోడి కూర అంటే అసలైన ఊరూరి వాసన! పొయ్యి మంట మీద చేసిన రుచికి సాటి లేదు.
జొన్న పిండి – 2 కప్పులు వేడి నీళ్లు – సరిపడా ఉప్పు – చిటికెడు నీళ్లు నెమ్మదిగా పోయాలి రా… ఒకేసారి పోస్తే ముద్ద కఠినం అవుతది అంటుంది అమ్మమ్మ.
పిండి వేడి నీళ్లతో ముద్ద చేసుకోవాలి చేత్తోనే తట్టి రొట్టెలా చేయాలి మట్టిపెనం మీద వేసి కాల్చాలి మంట ఎక్కువైతే కాలిపోతది జాగ్రత్త “రొట్టె ఊపిరి తీసుకుంటూ ఉబ్బుతుంటేనే అసలైన సిగ్నల్ రా!”
దేశీ కోడి – 1 కిలో ఉల్లి, టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం, ధనియా, గరం మసాలా కొత్తిమీర మసాలా మామూలుగా కాదు బాబోయ్… కారం మోతాదు వరంగల్ స్టైల్!
ముందుగా ఉల్లిపాయలు బాగా వేపాలి మసాలా వేసి నూనె వేరయ్యే వరకు వేయించాలి కోడి ముక్కలు వేసి బాగా కలపాలి నెమ్మదిగా మూతపెట్టి ఉడికించాలి “నీళ్ళు ఎక్కువ పోయొద్దురా… చిక్కగా ఉంటేనే రుచి!”
వేడి వేడి జొన్న రొట్టెకి చిక్కటి కోడి కూర నానబెట్టి తింటే… “అయ్యో… ఇంకో రొట్టె పెట్టమ్మా!” అనాల్సిందే
జొన్న రొట్టె డయాబెటిస్ వాళ్లకి మంచిది ఫైబర్ ఎక్కువ దేశీ కోడి ప్రోటీన్ రిచ్ పొట్ట నిండా తిన్నా హెవీ ఫీల్ ఉండదు
బిర్యానీ vs గుంటూరు స్పైసీ ఫుడ్ సర్వే ఫలితాలు…
షుగర్ పేషెంట్లు ఉదయం లేవగానే తినాల్సిన ఆరోగ్యకర ఆహారాలు..