మనశ్శాంతి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న తప్పులు మన మనసును అసాంత్వనంగా మార్చేస్తాయి.
ఉదయం లేవగానే మొబైల్ చూడటం చాలా మందికి అలవాటు. ఇది మనసును ఆందోళనలోకి నెడుతూ రోజంతా ప్రభావం చూపుతుంది.
పనులను వాయిదా వేయడం ఒత్తిడిని పెంచుతుంది. చివరికి ఒకేసారి ఎక్కువ పనులు రావడంతో మనశ్శాంతి కోల్పోతాం.
సరియైన సమయానికి నిద్ర పోకపోవడం మరో పెద్ద సమస్య. తగిన నిద్ర లేకపోతే మనసు అసహనంగా మారుతుంది.
రోజంతా నెగెటివ్ ఆలోచనలతో ఉండటం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది ఆనందాన్ని తగ్గించి ఒత్తిడిని పెంచుతుంది.
సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా మనసుపై ప్రభావం చూపుతుంది. పోషకాలు లేకపోతే మనం అలసటగా, నిరుత్సాహంగా ఉంటాం.
వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా బలహీనమవుతుంది. ఇది అనవసరమైన టెన్షన్ పెంచి మైండ్ ను బాగా డిస్టర్బ్ చేస్తుంది.
అత్యధికంగా సోషల్ మీడియా ఉపయోగించడం మనసును తెలియని ఆందోళనకు గురి చేస్తుంది. చూడడానికి చాలా సరదాగా ఉండే ఈ అలవాటు మీ లైఫ్ సైకిల్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది.
మన కోసం కొంత సమయం కేటాయించకపోవడం కూడా పెద్ద తప్పు. రిలాక్స్ అవ్వకపోతే మనశ్శాంతి క్రమంగా తగ్గిపోతుంది.