మేకప్‌లో ఫౌండేషన్ ముఖానికి సమంగా కవరేజ్ ఇవ్వడానికి ముఖ్యమైన భాగం. సరైన ఫౌండేషన్ వాడితే చర్మం సహజంగా మెరిసిపోతుంది, మేకప్ కూడా చాలా నేచురల్‌గా కనిపిస్తుంది.
మేకప్ చేసుకునే సమయంలో మన చర్మానికి సరిపోయే ప్రొడక్ట్స్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే సరైన మేకప్ ఎంపిక చేసుకునేందుకు సహాయపడే కొన్ని ప్రొడక్ట్స్ లిస్ట్ మీ కోసం..
లైట్ మేకప్ కావాలంటే లాక్మీ కాంపాక్ట్ పౌడర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఇది చర్మంపై ఆయిల్‌ను తగ్గించి ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది.
స్కిన్ టోన్‌కు సరిపడే షేడ్ కావాలంటే లోరియల్ ట్రూ మ్యాచ్ ఫౌండేషన్ చాలా మంది ఇష్టపడే ప్రొడక్ట్. ఇది స్కిన్‌తో బాగా బ్లెండ్ అయి సహజమైన లుక్ ఇస్తుంది.
ప్రొఫెషనల్ మేకప్ కోసం చాలా మంది మ్యాక్ స్టూడియో ఫిక్స్ ఫౌండేషన్ ను ఉపయోగిస్తారు. ఇది ఫుల్ కవరేజ్ ఇస్తూ ఎక్కువసేపు మేకప్ నిలకడగా ఉండేలా చేస్తుంది.
లగ్జరీ మేకప్ ప్రొడక్ట్స్‌లో డీయోర్ ఫౌండేషన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది చర్మానికి సాఫ్ట్ ఫినిష్ ఇచ్చి గ్లోయింగ్ లుక్ అందిస్తుంది.
ఫౌండేషన్ వేసే ముందు ప్రైమర్ వాడటం చాలా అవసరం. మార్స్ ప్రైమర్ వాడితే మేకప్ స్మూత్‌గా సెటిల్ అవుతూ పోర్స్ కూడా తగ్గినట్లు కనిపిస్తాయి.
ఫుల్ కవరేజ్‌తో పాటు నేచురల్ ఫినిష్ కావాలనుకునే వారికి టూ ఫేస్డ్ ఫౌండేషన్ మంచి ఆప్షన్. ఇది చర్మాన్ని మరింత సాఫ్ట్‌గా కనిపించేలా చేస్తుంది.
సింపుల్ మరియు ఎలిగెంట్ మేకప్ కోసం బాబీ బ్రౌన్ ఫౌండేషన్ కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసి మేకప్‌ను క్లాసీగా చూపిస్తుంది.