3 ఏళ్లలో ₹6,000 కోట్ల జీతం… సీఈఓకు రికార్డు స్థాయి ప్యాకేజీ

9th March 2026

White Scribbled Underline

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన సీఈఓ సుందర్ పిచాయ్‌కు రాబోయే మూడేళ్ల కాలానికి గాను సుమారు రూ.6,361 కోట్ల భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది.

ఈ ప్యాకేజీలో ప్రధానంగా 126 మిలియన్ డాలర్ల విలువైన పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు ఉండగా కంపెనీ నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తే ఈ విలువ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ కంపెనీ నిర్దేశించిన పనితీరు లక్ష్యాలను అందుకోకపోతే ఈ భారీ స్టాక్ ప్యాకేజీ విలువ సున్నాకు కూడా పడిపోయే ప్రమాదం ఉంది.

దీనికి అదనంగా ఆయనకు మూడేళ్ల కాలానికి 84 మిలియన్ డాలర్ల విలువైన రిస్ట్రిక్టెడ్ స్టాక్ తో పాటు వార్షిక వేతనంగా 2 మిలియన్ డాలర్లు అందుతాయి.

అటానమస్ వెంచర్లైన వేమో , వింగ్ ఏవియేషన్ వృద్ధిని ప్రోత్సహించేలా ఆల్ఫాబెట్ కొత్తగా 350 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది.

వేమోలో 130 మిలియన్ డాలర్లు , వింగ్ ఏవియేషన్‌లో 45 మిలియన్ డాలర్ల షేర్లు లభిస్తుండగా వీటి విలువ భవిష్యత్తులో 200 శాతం వరకు పెరిగే వీలుంది.

2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ గూగుల్ మార్కెట్ విలువను 535 బిలియన్ డాలర్ల నుండి ఏకంగా 3.6 ట్రిలియన్ డాలర్లకు పెంచారు.

ప్రస్తుతం ఆయన ప్యాకేజీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల , యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వార్షిక వేతనాల కంటే చాలా అధికం కావడం విశేషం.