ASBL NSL Infratech

అరకు ఏజెన్సీ ప్రాంతంలో నాటా వాటర్‌ ప్లాంట్ల ప్రారంభం

అరకు ఏజెన్సీ ప్రాంతంలో నాటా వాటర్‌ ప్లాంట్ల ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న నాటా సేవా డేస్‌ 2022 కార్యక్రమాల్లో భాగంగా పాడేరు, అరకు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించడానికివీలుగా 7 వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. శ్రీ సత్యసాయి సేవా సమితి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నాటా నిర్వహించింది. డోకులూరు, గేదలపాడు, మేభ (ఎగువ వీధి), మేభ, మేభ (చెరువు వీధి), అండిభ ప్రాంతాల్లో 30 లక్షల రూపాయలతో వాటర్‌ ప్లాంట్లను నాటా దాతల సహాయంతో ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 13వ తేదీన దీనిని ప్రారంభించారు. దాతలను సమన్వయం చేసుకుని నాటా మాజీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసల ఈ ప్రాజెక్టు ప్రారంభానికి విశేషంగా కృషి చేశారు. అలాగే గత్తుమ్‌, తోటకూరపాడు, పాటిగరువు, బంగారంగరువు, నేరెడు వలస, మంగళమామిడి, కంసాల గొంది ప్రాంతాల్లో కూడా 30 లక్షల రూపాయలతో వాటర్‌ ప్లాంట్లను నాటా దాతల సహాయంతో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కూడా మాజీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసల సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీవాసులకు దుప్పట్లను కూడా పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో నాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ళ రామిరెడ్డి, కార్యదర్శి నారాయణ రెడ్డి గండ్రతోపాటు, లక్ష్మీ నరసింహారెడ్డి, కలువాయి రాధాకృష్ణ, వెంకటరామిరెడ్డి తదితర నాటా నాయకులు పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 


 

Tags :