ASBL NSL Infratech

సబ్జెక్ట్‌పై పట్టు ఉందే ఉన్నతస్థానం పొందవచ్చు : నాటా ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి

సబ్జెక్ట్‌పై పట్టు ఉందే ఉన్నతస్థానం పొందవచ్చు : నాటా ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి

ప్రతి విద్యార్థి సబ్జెక్ట్‌ పై మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కృషి చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగాన్ని ఆయన సందర్శించి రసాయన శాస్త్ర విభాగంలోని అధ్యాపకులను, పరిశోధక విద్యార్థులను, విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విభాగ అధిపతి ప్రొ. వి పద్మావతి మాట్లాడుతూ డా.శ్రీధర్‌ రెడ్డి 1984లో ఎంఎస్సీ, 1990లో పీహెచ్‌డిని రసాయన విభాగంలో పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలో ఉన్నత స్థాయిలో నాటా ప్రెసిడెంట్‌గా ఉండడం రసాయన శాస్త్ర విభాగానికి గర్వ కారణం అని తెలిపారు.

శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దాదాపు 7 సంవత్సరాలలో ఉన్నత విద్యను అభ్యసించానని తెలిపారు. ఆ రోజులలో అధ్యాపకుల మార్గదర్శనం, సహచరుల ప్రోత్సాహం తనను ఈ స్థానానికి తీసుకువచ్చిందని తెలియజేశారు. అదే విధంగా రసాయన శాస్త్ర విభాగంలోని విద్యార్థులకు టీచింగ్‌, ఫార్మాసూటికల్స్‌ పరిశోధన, ఇతర పారిశ్రామిక రంగాలలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి విద్యార్థి సబ్జెక్ట్‌ పై మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నత స్థానానికి చేరుకోని దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఎన్వి శ్రీధర్‌, ఎన్‌ వెంకట సుబ్బరాయుడు, సురేష్‌ రెడ్డి, ప్రొ వై.వి రామిరెడ్డి, మాధవి, డా. జ్యోతి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

Tags :