ASBL NSL Infratech

టిటిఎ మెగా కన్వెన్షన్‌లో భద్రాచల సీతారాముల కళ్యాణం

టిటిఎ మెగా కన్వెన్షన్‌లో భద్రాచల సీతారాముల కళ్యాణం

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) సియాటెల్‌లో మే 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, మహిళా, బిజినెస్‌ కార్యక్రమాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంను మే 26వ తేదీన ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్వామివారి విగ్రహ మూర్తులను, అర్చకులు, వేదపండితులను భద్రాచలం దేవస్థానం నుంచి రప్పించారు. ఆరోజు ఉదయం 8 ఎఎం, (పిఎస్‌టి)కు ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందని కళ్యాణోత్సవ కమిటీ చైర్‌ మంజునాథ్‌ బేసాటి, కో చైర్స్‌ గుణేశ్వర్‌ శర్మ, నవీన్‌ దోర్నాదుల్‌, హరి గంప తెలిపారు.

 

 

Tags :