ASBL NSL Infratech

సినిమా వాళ్ళ గురించి ప్రస్తావించడం అవసరమా పవన్? 

సినిమా వాళ్ళ గురించి ప్రస్తావించడం అవసరమా పవన్? 

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రచారం జోరు పెంచాడు. ఇండివిజువల్ ప్రచారంతో పాటు చంద్రబాబు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపించే సమయంలో  సీనియర్ ఎన్టీఆర్.. సూపర్ స్టార్ కృష్ణ మధ్యలో ఉన్న విభేదం అనే టాపిక్ ని టచ్ చేయడం జరిగింది. ఇద్దరు విభేదించినా.. వేరు వేరు పార్టీలలో ఉన్నా.. ఎప్పుడు కృష్ణ సినిమాలను ఎన్టీఆర్ ఆపలేదని పవన్ అన్నారు. అయితే పవన్ ..ఎన్టీఆర్, కృష్ణ కాన్సెప్ట్ టచ్ చేయడంతో మహేష్ అభిమానులు ఒక్కసారిగా నెట్టింట అతని పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1983 ప్రాంతంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ విధానాలు న‌చ్చ‌క కృష్ణ కాంగ్రెస్ లోకి వెళ్లారు.

ఈ క్రమంలో కృష్ణ కొన్ని సినిమాలు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెరపైకి ఎక్కించారు అని కూడా టాక్ ఉంది. అయితే అప్పటి రాజకీయాలు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇలా రెండిటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు ఎప్పటివో విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తావించడం కరెక్ట్ కాదు అని మహేష్ అభిమానులు అంటున్నారు. ఏదో మాట్లాడబోయే అనవసరంగా మరింకేదో మాట్లాడి పవన్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న ఈ టైంలో మొత్తానికే ఎసరు తెస్తాడేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :