ASBL NSL Infratech

షర్మిలా vs అవినాష్.. లాభపడేది ఎవరు?

షర్మిలా vs అవినాష్.. లాభపడేది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికి మెయిన్ కారణం షర్మిల. 2004 లో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిన వైయస్సార్ కుమార్తె షర్మిల ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా మారింది. ఒకరకంగా జగన్ జైల్లో ఉన్నప్పుడు ప్రచారం మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని విజయం వైపు నడిపించింది అని టాక్ కూడా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రచారం కారణంగా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ ఓట్లు ఏ పార్టీ ఖాతాలోంచి వస్తాయి అన్న విషయంపై స్పష్టత లేదు. కడప వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట.. అక్కడ పార్టీ కంటే కూడా వైయస్సార్ కుటుంబానికి ప్రాముఖ్యత ఎక్కువ. పార్టీ కోసం కాదు వైఎస్సార్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కోసం ఓట్లు వేస్తారు. అయితే ప్రస్తుతం అదే కడప ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డి పై షర్మిల పోటీ చేయడం వల్ల కొంత రెండు పక్షాలకు నష్టం ఉంది. కడపలో షర్మిల విమర్శించే ప్రతీ మాటను టీడీపీ తన లబ్ధి కోసం ప్రచారం చేస్తోంది. ఇటు అవినాష్ రెడ్డి టీడీపీ ను పక్కన పెట్టి షర్మిలపై పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. దీంతో పిల్లి పోరు పిట్ట తీర్చే అన్నట్టు.. ఈ ఇద్దరి గొడవల్లో టిడిపి లాభపడుతుంది అన్నమాట వినిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :