ASBL NSL Infratech

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.  అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మే 9లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్‌ దాఖలుకు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరగా, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కంటే  పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :