ASBL NSL Infratech

రూట్ మారుస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్

రూట్ మారుస్తున్న యాంగ్రీ యంగ్ మ్యాన్

వ‌య‌సు దాటాక సీనియ‌ర్ హీరోలు సోలోగా మార్కెట్ కోల్పోవ‌డం కామ‌న్. దీంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగానో, విల‌న్లుగానో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంటారు. జ‌గ‌ప‌తి బాబు అలానే కెరీర్ ను ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఊహించిన దాని కంటే భారీ డిమాండ్ ను సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ కూడా దీన్ని గుర్తించి స‌పోర్టింగ్ రోల్స్ తో పాటూ క‌థ న‌చ్చితే ఏ పాత్ర‌నైనా చేయ‌డానికి వెనుకాడ‌టం లేదు. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ కూడా ఈ దారిలోనే న‌డుస్తున్నట్లు తెలుస్తోంది.

గ‌త కొన్నేళ్లుగా రాజ‌శేఖ‌ర్ ఓ డైల‌మాలో ఉన్నాడు. క‌ల్కి, శేఖ‌ర్ లాంటి సినిమాలతో హీరోగా ట్రై చేసిన‌ప్ప‌టికీ అవి బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఫైన‌ల్ గా రూటు మార్చి త‌న ఇమేజ్, వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లు ఎంచుకుంటున్నాడు. గ‌తేడాది ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ లో పోలీసాఫీసర్ గా డిఫ‌రెంట్ గా ట్రై చేశాడు రాజ‌శేఖ‌ర్. ఆ సినిమా రాజ‌శేఖ‌ర్ కు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.

ఇప్పుడు తాజాగా శ‌ర్వానంద్36లో తండ్రి పాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు రాజ‌శేఖ‌ర్. దీంతో ఫ్యూచ‌ర్ లో రాజ‌శేఖ‌ర్ ఎలాంటి క్యారెక్ట‌ర్ల‌ను ఎంచుకుంటాడ‌నే విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమాతోనైనా రాజ‌శేఖ‌ర్ స‌క్సెస్ అవుతాడా అనేది చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :