ASBL NSL Infratech

రాహుల్, ప్రియాంకా గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు

రాహుల్, ప్రియాంకా గాంధీల  ప్రచార షెడ్యూల్ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర ముఖ్యనేతలు మే మొదటి వారంలో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. రాహుల్‌ గాంధీ ఈ నెల 5న నిర్మల్‌, గద్వాల్‌ ఎన్నికల  ప్రచార సభల్లో పాల్గొననున్నారు. 9న కరీంనగర్‌, సరూర్‌నగర్‌ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కరీంనగర్‌, చేవెళ్ల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రియాంక ఈ నెల 6న ఎల్లారెడ్డి, తాండూర్‌, సికింద్రాబాద్‌లలో ప్రచార సభలకు హాజరుకానున్నారు. 7న నర్సాపూర్‌, కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :