ASBL NSL Infratech

పుష్ప‌2లో బుట్ట‌బొమ్మ స్పెష‌ల్ సాంగ్?

పుష్ప‌2లో బుట్ట‌బొమ్మ స్పెష‌ల్ సాంగ్?

మొన్న‌టివ‌ర‌కు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం చేతిలో ఆఫ‌ర్లు లేక ఖాళీగా ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఎలాంటి ఛాన్స్ వ‌చ్చినా చేయ‌డానికి పూజా రెడీగా ఉంది. రెండు మూడు సినిమాలు డిస్క‌ష‌న్స్ లో ఉన్నాయంటుండ‌గా, ఇప్పుడు స‌డెన్ లో పూజా హెగ్డే పుష్ప‌2 సినిమాలో స‌ర్‌ప్రైజ్ చేయ‌నుంద‌నే టాక్ నెట్టింట వినిపిస్తుంది.

ఇప్ప‌టికే బ‌న్నీతో డీజే, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల కోసం జోడీ క‌ట్టిన పూజా, ఇప్పుడు మ‌రోసారి బ‌న్నీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో పూజాకి స‌రైన ఛాన్సులు రావ‌డం లేద‌ని ఛాన్స్ ఇచ్చి లిఫ్ట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట బ‌న్నీ. ఈ నేప‌థ్యంలో పుష్ప‌2లో స్పెష‌ల్ సాంగ్ ను పూజాతో చేయించాల‌నేది బ‌న్నీ ప్లాన్‌గా తెలుస్తోంది.

పుష్ప‌1లో స‌మంత చేసిన ఊ అంటావా సాంగ్ లానే పుష్ప‌2లో కూడా ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ట‌. ఆ పాట‌ను దేవీ శ్రీ ప్ర‌సాద్ నెక్ట్స్ లెవెల్ లో కంపోజ్ చేశాడ‌ని ఇప్ప‌టికే టాక్ బ‌య‌టికొచ్చింది. ఆ స్పెష‌ల్ సాంగ్  కోసం ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు పూజా పేరు కూడా చ‌ర్చ‌ల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే సుకుమార్ రంగ‌స్థలంలో పూజా స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఆ సెంటిమెంట్ ప్ర‌కారం సుకుమార్ పూజాని తీసుకునే ఛాన్స్ లేక‌పోలేదు. పూజాకి ఈ ఛాన్స్ వ‌స్తే మాత్రం టాలీవుడ్ లో మ‌ళ్లీ అవ‌కాశాలు క్యూ క‌ట్ట‌డం ఖాయం.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :