ASBL NSL Infratech

సంక్రాంతికి బాల‌య్య సినిమా లేన‌ట్టేనా?

సంక్రాంతికి బాల‌య్య సినిమా లేన‌ట్టేనా?

భ‌గ‌వంత్ కేస‌రి త‌ర్వాత బాల‌కృష్ణ‌, బాబీ కొల్లి ద‌ర్శ‌కత్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య కెరీర్లో 109వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఏపీ ఎల‌క్ష‌న్స్ కోసం బ్రేక్ ఇచ్చారు. వ‌చ్చే నెలాఖ‌రు నుంచి బాల‌య్య ఈ సినిమా షూటింగ్ తిరిగి పాల్గొనే ఛాన్సుంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు షూటింగ్ అయిన భాగానికి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్స్క్ ను నిర్వ‌హిస్తుంది టీమ్.

ఇదిలా ఉంటే ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ‌రోసారి పండ‌గ సెంటిమెంట్ ను వాడుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవాల‌ని బాల‌య్య ఫ్యాన్స్ ఆశ ప‌డుతున్నారు. కానీ ఎన్బీకే109 టార్గెట్ సంక్రాంతి కాదట. ఎల‌క్ష‌న్స్ పూర్తి కాగానే వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను పూర్తి చేసి ద‌స‌రాకు బ‌రిలో దించాల‌ని బాల‌య్య అనుకుంటున్నాడ‌ట‌.

దానికి తోడు ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన సితార బ్యాన‌ర్ నుంచి సంక్రాంతికి ర‌వితేజ సినిమా రిలీజ్ ఉండ‌టంతో బాల‌య్య మూవీని ద‌స‌రాకు దించాల‌ని చూస్తున్నార‌ట‌. ఆగ‌స్ట్ నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు ఇప్ప‌టికే ప‌లు క్రేజీ సినిమాలు రిలీజ్ డేట్స్ ను షెడ్యూల్ చేసుకున్నాయి. వాట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :