ASBL NSL Infratech

వైసీపీకు ప్లస్ నుంచి మైనస్ గా మారుతున్న ముద్రగడ..

వైసీపీకు ప్లస్ నుంచి మైనస్ గా మారుతున్న ముద్రగడ..

మనకు ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు.. ఎంతో జాగ్రత్తగా ఆ బాధ్యత నిర్వహించాలి. అంతే తప్ప అనవసరంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మొదటికే మోసం తెచ్చి పెట్టకూడదు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఇలాగే తయారైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం.. కులం అంటూ కులాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ.. కుల రాజకీయాలు చేయడం కోసం ఆసక్తి చూపుతున్న వ్యక్తిగా ఇప్పటికే అతనికి ఓ బ్రాండ్ పడిపోయింది. మరీ ముఖ్యంగా అతను జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.

పవన్ మాత్రం ముద్రగడ విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ముద్రగడ అల్లుడు ,కుమార్తె స్వయంగా జనసేనలో చేరడానికి వచ్చినప్పుడు సున్నితంగా వారించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో చేరడం మంచిది కాదని సర్ది చెప్పి.. మరికొన్ని రోజుల తర్వాత పార్టీలో చేర్చుకుంటాం అని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సందర్భంలో ఎక్కడ ముద్రగడ గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడంతో ప్రజల్లో పవన్ కు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు ముద్రగడ అనే మాటల్ని తాను పెద్దగా పట్టించుకోను అని చెప్పిన పవన్.. ఇంట్లో పెద్దోళ్ళు ఒక మాట అంటే భరించలేమా? అంటూ ముద్రగడకు లేని పెద్దరికం ఆపాదించడంతోపాటు తనకు అతనిపై ఉన్న గౌరవాభిమానాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. పవన్ చాలా పక్క ప్లానింగ్ తో ఎక్కడా..ఎవరి మనసు నొప్పించకుండా సైలెంట్ గా ముందుకు పోతున్నారు. ఈ విషయం అందరికీ అర్థమవుతున్న ఒక ముద్రగడ కు మాత్రం అర్థం అవుతున్నట్లు కనిపించడం లేదు.

దీంతో ఇంత అనుభవం ఉన్న ముద్రగడ.. పవన్ ముందు వయసులో పెద్ద అయినప్పటికీ.. మిగిలిన అన్ని విషయాల్లో చిన్నగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా స్థితప్రజ్ఞత కనబరుస్తుంటే.. ముద్రగడ మాత్రం ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఇది పిఠాపురంలో పవన్ బలపడడానికి ఓ ముఖ్య కారణంగా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికైనా ముద్రగడ మాటలకు బ్రేకులు వేయకపోతే.. అతని మాటల జోరు.. హోరుగా మారి అధికార పార్టీకి నష్టం చేకూర్చడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :