'మనమే' టీజర్ టాక్
ఒకే ఒక జీవితంతో మంచి హిట్ ను అకౌంట్ లో వేసుకున్న శర్వానంద్ ఇప్పుడు మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు బాగా లేటయింది. ఇప్పుడు ఆఖరికి మనమే సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చూడ్డానికి మంచివాడిలా కనిపించినప్పటికీ తాను మంచోడు కాదనే నమ్మకంతో ఉండే హీరో లైఫ్ లోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె పరిచయం ప్రేమగా మారే టైమ్ లో ఓ చిన్న బాబు ఎంట్రీ ఇస్తాడు. ఎంత అల్లరి చేస్తున్నా భరిస్తూ ఉండటమేంటనేది టాప్ సీక్రెట్ గా కనిపిస్తుంది.
అసలు ఆ బాబు ఈ ఇద్దరికీ పుట్టాడా లేక దీని వెనుక ఇంకేమైనా స్టోరీ ఉందా అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఫారిన్ లోనే జరుగుతుంది. ఈసారి శ్రీరామ్ ఆదిత్య కంప్లీట్ ఫ్యామిలీ రూట్ పట్టాడు. చిన్న పిల్లాడి సెంటిమెంట్ తో సినిమాలు కొత్తేం కాదు కానీ ఈ మధ్య కాలంలో ఇలా ఎవరూ ట్రై చేయలేదు. కల్కి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారయ్యే ఛాన్సుంది.