ASBL NSL Infratech

వైసీపీకు రాజీనామా చేసిన కీలక నేత..

వైసీపీకు రాజీనామా చేసిన కీలక నేత..

వైసీపీ పార్టీ సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన తన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని తెలియజేసిన విజయ్ భాస్కర్ రెడ్డి పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ పై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తన పదవిపై ఎప్పుడు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి కోసం చేసింది ఏమీ లేదని పుట్టపర్తికి అభివృద్ధి కావాలంటే .. మాటలు చెప్పే పార్టీని కాకుండా చేతలు చేసే పార్టీని ఎంచుకోవాలని తెలియజేశారు. గతంలో కూడా విజయభాస్కర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డికి మరోసారి టికెట్ ఇస్తే పనిచేయబోమని అని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. అయినా సరే పుట్టపర్తి టికెట్ మరొకసారి శ్రీధర్ రెడ్డి కే ఇవ్వడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :