ASBL NSL Infratech

కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ పై కేటీఆర్ ట్వీట్..

కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ పై కేటీఆర్ ట్వీట్..

తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుకోవాలి అని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తమ ఉనికి నిలబెట్టుకోవాలి అని బీఆర్ఎస్ కుస్తీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మరొకసారి సెటైర్ల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఈ ఆరు వస్తువులను సమకూర్చుకోవాలి అని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. ఇంతకీ ఆ ఆరు వస్తువులు ఏమిటో తెలుసా..ఇన్వర్టర్స్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్, జనరేటర్స్, పవర్ బ్యాంక్స్ లను తెలంగాణ వాసులు తమ దగ్గర ఉంచుకోవాలని కేటీఆర్ సూచించారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇస్తాను అని చెప్పినా సిక్స్ గ్యారెంటీస్ అవేనని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు… కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి అని విమర్శించారు. ఈ నేపథ్యంలో రేపు మే 13న ప్రజలు తెలివిగా ఓటు వేయాలని కేటీఆర్ సూచించారు. దీనితో పాటుగా ఓట్ ఫర్ కార్, కేసీఆర్ ఫర్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్స్ ను తన పోస్టుకు జత చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :